మత సామరస్యానికి ప్రతీకగా పీర్ల పండగ

Pirla festival is a symbol of religious harmonyనవతెలంగాణ – నసూరుల్లాబాద్
బాన్సువాడ డిజైన్ పరిధిలోని నసురుల్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో గురువారం కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ వైభవంగా జరుపుకున్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉదయం నుండి పీర్ల పండగ ఉత్సాహాలు ఘనంగా నిర్వహించారు. ఖాసిం దులహా, బిబి ఫాతిమా పీర్లను గ్రామంలో తిరుగుతూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదర భావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంత ఘనంగా జరుపుకునే మోహర్రం పండుగ నసురుల్లాబాద్  మండలంలోని దూర్కి నసురుల్లాబాద్ గ్రామంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ గ్రామంలో ఇంత వైభవంగా నిర్వహించే పండుగను చూడడానికి చుట్టు పక్కల గ్రామస్తులకే కాకుండా వివిధ గ్రామాల్లో  ఉన్న బంధువులు సైతం పెద్దగా వస్తుంటారు. దీంతో గ్రామంలో ఐదు రోజుల పాటు పండుగ వాతా వరణం నెలకొంటుంది. చివరి రోజు అయిన నేడు గ్రామాల్లో పీర్ల పండగ ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుత వాతావరణం లో పీర్ల పండుగ జరుపుకోవడం సంతోషకరంగా ఉందని బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ, సీఐ రూరల్ సత్యనారాయణ ఎస్సైలు తెలిపారు.