తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని బిసి-డి నుండి బిసి ఏ లోనికి మార్చాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మసాగర్ మండల కేద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మైనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా అభయహస్తం లో ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 15 నుండి 20 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అవిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం ముదిరాజులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ముదిరాజులకు ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరారు. చెరువులు కుంటల పై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలన్నారు.త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల.సత్యనారాయణ,మాజీ సర్పంచి మహేందర్ ,రమేష్ మంచి శాఖ కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.