పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 11 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌తో రెండు సార్లు ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్ తాడోపేడో తేల్చుకోనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన హర్యానా స్టీలర్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్లే ఆఫ్స్‌లో పోరాడిన పట్నా పైరేట్స్ టైటిల్ పోరులో తిరుగులేని రికార్డు ఆత్మవిశ్వాసంతో సవాల్ విసురుతోంది. హర్యానా స్టీలర్స్‌కు శివం, వినరు, రాహుల్, సంజరు సహా మహ్మద్‌రెజా, జైదీప్‌లు కీలకం. పట్నా పైరేట్స్‌కు దేవాంక్, అయాన్, శుభమ్ షిండె, అంకిత్, దీపక్, గుర్దీప్‌లు కీలకం. ఇరు జట్లు రెయిడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బలంగా ఉన్నాయి. నేడు టైటిల్ పోరులో ఆఖరు కూత వరకు ఉత్కంఠ తప్పదు. పీకెఎల్ 11 ఫైనల్ నేడు రాత్రి 8 గంటలకు ఆరంభం.