తొగుట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ప్లాగ్ మార్చ్

– ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం
– తొగుట సిఐ లతీఫ్.
నవతెలంగాణ – తొగుట
కెప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం  తొగుట సిఐ లతీఫ్ అన్నారు. గురువారం లోక్ సభ  ఎన్నికల సందర్భంగా తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ బీ. లింగం, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాల తో తొగుట మండల కేంద్రం, వెంకట్రావుపేట, ఘన పూర్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తొగుట సిఐ మాట్లాడుతూ ఇన్సి డెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వ హించడానికి రాష్ట్ర వ్యాప్తం గా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య దేశం లో ఓటు హక్కు వజ్రాయుధం అన్నారు. ఎన్నికల కు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయాలని సూచించారు. భార త ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ-విజిల్ (సివిఐజిఐఎల్) యాప్ ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బం దులకు గురిచేసిన కాంప్లెట్ చేయాలన్నారు. డబ్బు ల ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం, డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన ఎన్నికల నియమావళికి అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన చట్ట పరమైన చర్యలకు గురిఅవు తారని తెలిపారు. అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు, యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకు ని ఫోటోలు, వీడియోలు తీసి ఫిర్యాదు చేయాలని సూచించారు.