జుక్కల్ లో శశస్త్ర సీమా బల్ బలగాల ప్లాగ్ మార్చ్

నవతెలంగాణ – జుక్కల్: మండల  కేంద్రంలో  జుక్కల్ ఏస్సై సత్యనారాయణ అద్వర్యంలో  కేంద్ర శశస్త్ర సీమా బల్ ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా నవంబర్ ముప్పైన  అసెంబ్లి   ఎన్నికల  సందర్భంగా  శాంతీభధ్రతలో బాగంగా మండల కేంద్రంలో ప్లాగ్  మార్చ్ నిర్వహించామని తెలిపారు. శాంతీ భద్రతలో అటంకం కల్గించే వారిని ఉపేక్షించేది లేదని, ఎన్నికల నిభందనల ప్రకారం ఓటర్లు , ప్రదాన పార్టీలు, అబ్యర్థులు తమ కార్యకర్తలకు సంమయమనం పాటించే విధంగా వారు అవగాహన చేయాలని, శాంతీయుతంగా ఎన్నికల నిర్వహణకు ఓటర్లు, ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శశస్త్ర సీమా బల్ బలగాలు, జుక్కల్ ఎస్సై, పోలీసులు తదితరులు పాల్గోన్నారు.