నవతెలంగాణ-వీణవంక
వరద నష్టంపై ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్ ఆదేశించారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షానికి మండలంలోని కనపర్తి గ్రామంలో కనపర్తి-వీణవంక రహదారి పూర్తిగా తెగిపోగా దానికి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ పర్లపల్లి రమేష్, తహసీల్దార్ దండిగ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ రాంబాబు, నాయకులు పులి ప్రకాష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.