నవతెలంగాణ – తొగుట
పువ్వు విచ్చుకున్న 10 రోజులకు మందు పిచికారీ చేయలని మండల వ్యవసాయ అధికారి మోహన్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని ఘనపూర్ గ్రామంలో గంగసాని మళ్ళా రెడ్డి రైతు యొక్క పొద్దు తిరుగుడు పంటలో స్టెమ్ గిర్డ్ల్ అనే పురుగు పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండసైహలోత్ర్హిణః 9.5%+థియో మేథక్సిన్ 12.6 (అలికా సిజెంట వారి)80 మి. లీ ఒక ఎకరాకు 200 లీటర్లు నీటికి కలిపి పువ్వ కాడ వెనక భాగంలో పడే విధంగా పిచికారీ చేయాలని తెలిపారు. పూత దశలో ఉన్న పంటలో పువ్వు విచ్చుకున్న 10 రోజులకు మందు పిచికారీ చేయా లని అన్నారు. ఈ పురుగు వలన పువ్వు కాడ కింద 2 ఇంచుల భాగంలో కాడ కట్ చేయడం వల న పువ్వు కింద పడిపోతుందని వివరించారు. క్షేత్ర సందర్శనలో రైతులు మల్ల రెడ్డి, తదితరులు ఉన్నారు.