పత్తి పంట రక్షణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

– ఏడిఏ బాబు నాయక్.

నవతెలంగాణ- రాయపోల్
పత్తి పంట రక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఏడిఏ బాబు నాయక్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి పంటలకు కలిగే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామంలో రసం పీల్చు పురుగులు, లద్దె పురుగులు ఆశించినట్లు గుర్తించడం జరిగిందన్నారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఫెర్రీప్రొక్సిఫెన్ మరియు డయఫెన్తిరాన్ రెండు కలిసి 2 మిల్లీలీటర్లు, లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. అలాగే ఫిప్రోనిల్ 2 మీల్లి లీటర్ల చొప్పున ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలన్నారు. లద్దే పురుగు నివారణకు క్లోరంట్రనిలిప్రోల్ మరియు సైడలోత్రిన్ లేదా నోవాల్యూరాన్ మరియు ఇమాయోక్టిన్ బెంజోయేట్ ను 1.5 మీ.లీ, లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 10 పంపులు అనగా 200 లీటర్లు నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని నీటివసతి ఉన్న రైతులు పత్తిలో ఒకటి లేదా రెండు తడులు ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగిందన్నారు. ఇలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకొని జాగ్రత్తలు వహించినట్లయితే పత్తి పంటలను రక్షించుకోవచ్చని రైతులకు సూచించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రశాంత్, రైతులు ఇప్ప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.