
మొగి పురుగు నివారణకు తొలి దశలో సస్యరక్షణ చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మోహన్ సూచించారు. సోమవారం లింగంపేట గ్రామంలో వరి, ఖీర పంటలను ఏరువాక కేంద్రం శాత్రవేత్త విజయ్ కుమార్, వ్యవసాయ అధికారి మోహన్ సందర్శించారు. వరి పొలం ములలో మొగి పురు గు ఉదృతి సలెఫ్డ్ ఇంజురీ, నాచు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొగి పురుగు నివారణకు తొలి దశలో క్లోరనట్రా నీలి ప్రోల్ 0.4 గుళికలు ఎకరాకు 4 కేజీలు, లేదా కార్తప్ హైడ్రో క్లోరైడ్ 4 గ్రా. గుళికలు ఎకరాకు 8 కిలోలు వాడా లని సూచించారు. లేదంటే ఫైప్రోనిల్ గుళికలు 6 కేజీలు, కట్ప హైడ్రోక్లోరిదే 50% ఎస్పీ అనె మందుని ఎకరాకు 400 గ్రాములు, క్లోరనెరనినిప్రోల్ 18.5 ఎస్ సి మందుని 60 ఎం. ఎల్ ఎకరాకు, ఎసిఫేట్ 400 గ్రాములు వాడాలని తెలిపారు. వీటితో పాటు వేప నూనె 1500 పిపిఎం ఎకరాకు ఒక లీటర్ కలిపి పిచికారీ చేయాలి, సుల్ఫీడ్ ఇంజురీ నివార ణకు పొలమును తడి, పొడి విధానంలో ఆరపెట్టా లన్నారు. ఫార్ములా 6 మందును 5 గ్రా. లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి, నాచు నివారణకు చేయి తో కలుపు తీయుట లేదా గొలుసు లాగడం చెయా లన్నారు. ఖీర పంటలో నులి పురుగు (నెమటోడు) గమనించామని అన్నారు. నివారణకు పంట పెట్టె ముందు కాళీ నేలలో ప్లాపైరుమ్ అనే మందు ఎక రాకు 300 ఎం.ఎల్ పిచికారీ చేయాలన్నారు. బంతి పంటతో పంట మార్పిడి చేయాలని సూచిం చారు. ఈ సందర్శనలో విస్తరణ అధికారి రాజేష్ రైతులు గొడుగు యాదగిరి తదితరులు ఉన్నారు.