మొక్కలు నాటిన డిఎస్పి 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్  ఆదేశానుసారం,  నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు, శంకర్, సందీప్, సురేష్,  సిబ్బంది పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పచ్చదనం పెంచే విధంగా మొక్కలను రక్షించాలని కోరారు.  ప్రజలందరూ రేపటి  భవిష్యత్తు కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.