మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలి

మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలి– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజక వర్గం శంకర్‌పల్లి మండలంలోని మాసానిగూడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహౌత్సవ కార్యక్రమంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భావితరాల వారు బాగుండాలంటే ఇప్పటినుంచి మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంచుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. మొక్కలు నాటడం గొప్పతనం కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా మన మందరం తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రస్తుత తరుణంలో ఎక్కడపడితే అక్కడ చెట్లు నరకడం వల్ల పర్యావరణం దెబ్బ తినే అవ కాశాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని మళ్లీ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, మాజీ సర్పంచ్‌ రాములు, మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్‌, మాజీ వార్డు సభ్యులు, ఎంపీవో గీత, ఏపీవో నాగభూషణం, ఏపీఎం భీమయ్య, గ్రామ కార్యదర్శులు, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.