మొక్కల పెంపకం మనందరి భాద్యత..

Planting is our responsibility.– ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ స్వాతి 
నవతెలంగాణ – ధర్మారం
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ స్వాతి అన్నారు మండలం లోని పత్తిపాక ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు . రాష్ట్రంలో అటవీశాతం పెంచేందుకు ప్రభు త్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇంటి ఆవరణతోపాటు ఖాళీ స్థలాలు, రోడ్ల కు ఇరువైపులా, వ్యవసాయ పొలంగట్లపై పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచాలని కోరారు. బావితరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందాలంటే ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, కె. పి నరేందర్ రావు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఏలేటి పద్మ, పత్తిపాక, నాయకాంపల్లి గ్రామ పంచాయతి కార్యదర్సులు శిరీష, సంజీవ్,పాఠశాల ఉపాధ్యాయులు జి. శ్రీలత, ఎ. శారద, సునిల్,సరిత, విఠల్, కృష్ణమోహన్, ప్రసాద్, రాజమల్లయ్య, సుజాత, స్వరూప, శేఖర్, గౌతమ్, రజిత గ్రామ పంచాయతి సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్ కుంట మల్లయ్య, కారోబార్ రవి,భాస్కర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.