మొక్కలు నాటే పనులు ముమ్మరంగా చేపట్టాలి

– మండల ప్రత్యేక అధికారి అనిత
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో భారత వజ్రో త్సవాల సందర్భంగా మొక్కలు నాటే పనులను ము మ్మరంగా చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి అనిత అన్నారు, భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిపురం జిపిలో 3 వేల మొక్కలు, కల్కూడ 5 వేలు, పెద్దా పూర్లో 5 వేలు, తిమ్మాపూర్‌లో 2 వేలు, దామస్తాపూ ర్లో 5 వేలు, తుమ్మలపల్లిలో 2 వేలు, మల్లికార్జు నగిరిలో 2 వేలు, కొత్లాపూర్‌లో వెయ్యి,కోట్‌ మర్పల్లి లో 2 వేలు,రావులపల్లి లో 2 వేలు,వీర్లపల్లి లో ఒక వెయ్యి మొత్తము 30 వేల మొక్కలు తేదీ 26 8 20 23 నాడు ప్లాంటేషన్‌ నాటుటకు గుంతలు తీయిం చడం జరిగిందని ఏపీవో అంజిరెడ్డి తెలిపారు. మొక్క లు నర్సరీల నుండి వర్క్‌ సైటుకు సరఫరా చేయిం చడం పనులను గురువారం ప్రత్యేక అధికారి అనిత పరిశీలించడం జరిగింది, సిరిపురం, తిమ్మా పూర్‌, పెద్దాపూర్‌, దామాస్తాపూర్‌, కల్కూడ, భూచనపల్లి తదితర గ్రామాలను ఆమె సందర్శించారు. మొక్కల పెంపకం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనులు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో రాజ మల్లయ్య, ఏపీవో అంజిరెడ్డి, సిరిపురం సర్పంచు మల్లయ్య, పెద్దాపూర్‌ సర్పంచ్‌ ఉమారాణి గోపాల్‌ రెడ్డి, కల్కూడ సర్పంచ్‌ శివకుమార్‌, దామస్తా పూర్‌ సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డి,భూచన్పల్లి సర్పంచ్‌ జయ దయాకర్‌, సాంకేతిక సహాయకులు విష్ణు వర్ధన్‌ రెడ్డి,బలవంతు రెడ్డి,వెంకటేష్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అంజయ్య,సుభాష్‌ రెడ్డి,రవి,మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు