వృక్షాలు మన జీవన విధానంలో ఒక భాగం

Plants are a part of our way of lifeనవతెలంగాణ – తొగుట
వృక్షాలు మన జీవన విధానంలో ఒక భాగమని వృక్షాలు లేకపోతే మన జీవనం సాగించలేమని వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మర్యాల వాణి  అన్నారు. శనివారం మండలంలోని చందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విత్తనాలను విద్యార్థుల సహకారంతో సీడ్ బాల్స్ గా తయారు చేసి విద్యార్థులకు వృక్షాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వివరించారు. వృక్షాలు మన జీవన విధానంలో ఒక భాగ మని, వృక్షాలు లేకపోతే మన జీవన మనుగడ సాగించ లేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. “వృక్షో రక్షతి రక్షితః – వన సంరక్షణ మన సంరక్షణ” అనే నినా దాన్ని విద్యార్థులకు బోధిస్తూ వాటి యొక్క ప్రాము ఖ్యతను చెప్పారు. విద్యార్థులచే సీడ్ బాల్స్ తయారు చేయించారు. ఈ సీడ్ బాల్స్ తయారీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం హర్ష ణీ నియం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధేశ్వర్, ఉపాధ్యాయ యులు రాంబాబు, నగేష్, రాజలింగం, గంగ, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.