
– హరితహారంలో నాటిన మొక్కలు కనిపించని పరిస్థితి
– ప్రారంభమైన 10వ విడత హరితహారం
నవతెలంగాణ – మల్హర్ రావు
పల్లెలను సుందరికరణ చేస్తాం, హరితహారంలో నాటిన మొక్కలతో పచ్చదనం ఒట్టిపట్టేలా చేస్తామన్న ప్రజాప్రతినిధుల, అధికారుల మాటలు ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలనే లక్ష్యాన్నీ నిర్దేశిస్తూ రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అంతంగానే ఉంటుంది.మండలంలోని తాడిచెర్ల, శాత్రజ్ పల్లి,పెద్దతూoడ్ల,మల్లారం,కొయ్ యుర్, రుద్రారం,వళ్లెంకుంట,కొండంపేట, ఎడ్లపల్లి తోపాటు అన్ని గ్రామాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కొద్దీ కాలానికే అవి కనుమరుగైపోతున్నాయి.అధికారుల కాగితాల లెక్కల్లో వందశాతం లక్ష్యం సాధించామని చెబుతూ బిల్లులు మాత్రం పక్కాగా పెడుతున్నారు.కానీ నాటిన చోట మొక్కలు కనిపించడం లేదు.గతంలో నాటిన చోట మళ్ళీ హరితహారం నిర్వహించారు.కొన్ని గ్రామాల్లో కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు కనుమరుగైయ్యాయి. తాడిచెర్ల, శాత్రజ్ పల్లి వంటి గ్రామాల్లో కంచెలు ఏర్పాటు చేసిన కంచెలతోపాటు మొక్కలు మాయమవడం గమనార్హం.ఇంకోన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్లు తీయకుండానే గుంతల్లో నిర్లక్ష్యంగా నాటడం మరో విశేషం.ఇంకొన్ని గ్రామాల్లో పెరిగిన కాసన్ని మొక్కలు ముగజీవాలు బహిరంగంగా ముడుతున్నాయి.మరికొన్ని మొక్కలు నాటకుండా రోడ్ల ప్రక్కన పడవేసిన పరిస్థితి. మొత్తంగా మండలంలో నాటిన మొక్కలు కనీసం 20 శాతం వృక్షాలుగా మారిన దాఖలాలు లేవు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అధికారుల,పాలకవర్గాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల్లో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టడంతో కొంత మేర వృక్షాలుగా మారుతున్నాయి.
మండలంలో పరిస్థితి ఇలా..
2021-22, 2022-23 సంవత్సరాల్లో 1లక్ష 80 వేల మొక్కలు ఉపాధిహామీ పథకం ద్వారా నర్సరీల్లో మొక్కలు పెంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలల్లో,వసతి గృహాల్లో, ఖాళీ స్థలాల్లో ఉపాధిహామీ కూలీలతో వివిధ రకాల మొక్కలు నాటారు.విటి సంరక్షణ చర్యలకు మొక్కల చెట్టు ప్లాస్టిక్ కంచెలు సైతం ఏర్పాటు చేశారు.కానీ ఇపుడు పరిశీలిస్తే కనీసం 10 శాతం మొక్కలతోపాటు కంచెలు కూడా కనిపించడం లేదు.ఉపాది హామీ పథకంలో మొక్కలు నాటడానికి వచ్చిన కూలీలకు సైతం కూలి డబ్బులు ఇవ్వలేదనే విమర్శలున్నాయి. బుధవారం మాత్రం 10వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్నీ ప్రారంభించారు.ఈ 10వ విడత హరితహారంలో మండల వ్యాప్తంగా 92 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా 15 నర్సరీల్లో మొక్కలు పెంచారు.కనీసం ఈ సారైనా నాటిన మొక్కలు సంరక్షణ చర్యలు చేపడతారా.? లేదా గాలికొదిలేస్తారో చూడాలి.