నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గాలిలో ఆక్సిజన్ శాతం పెరగాలంటే మొక్కలను తప్పనిసరిగా పెంచాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు గురువారం హుస్నాబాద్ పట్టణంలోని 12,14 ,20 వ వార్డులో ఇంటింటికి పూలు, పండ్ల మొక్కల పంపిణీ చేశారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడకు కష్టమవుతుందని, మీ ఇంటికి వచ్చి ఇచ్చిన ప్రతి మొక్కను కాపాడాలని తెలిపారు.మీ ఇంటి ముందు పెరుగుతున్న మొక్కలను కూడా సంరక్షించాలని సూచించారు.ఈరోజు నాటిన మొక్క భవిష్యత్ తరాల వారికి ఎంత ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వార్డు కౌన్సిలర్ లు గుళ్ళ రాజు, సరోజన ,సుప్రజ, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, వనహోత్సవ సూపర్వైజర్ శంకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, వార్డ్ ఆఫీసర్స్ వంశీ, పద్మ, మమత, సాంబ రాజు,జవాన్ ప్రభాకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.