– వెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు పెంచాలి
– ఆదనపు కలెక్టర్ మనుచౌదరి
నవతెలంగాణ – తిమ్మాజీపేట
మండలంలోని చేగుంట గ్రామం అవెన్యూ ప్లాంటేషన్‌లో మరిన్ని మొక్కలను పెంచాలని అదనపు కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. ఈ నెల 6న ప్రభుత్వ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవానికి నాగర్‌కర్నూల్ విచ్చేస్తు న్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆయన ఆదివారం చేగుంట గేటు వద్ద అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ భూత్పూర్ నా గర్క ర్నూల్ ప్రధాన రహదారిలో వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా అధికా రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆయన చేగుంట అవె న్యూ ప్లాంటేషన్ పరిశీలించారు. ప్లాంటేషన్లో మరిన్ని మొక్కలు పెంచు కోవా లని ఆవంచ గ్రామ సమీపంలోని అవెన్యూ ప్లాంటేషన్ నుంచి200 మొ క్కలు తెప్పించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యట న సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రామాలకు సంబం ధించిన అవెన్యూ ప్లాంటేషన్ ను సీఎం పరిశీలించే అవకాశం ఉందని జిల్లా, మండలాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుమ్మ కొండ, మననాయక్‌తాండ సమీపంలో అవెన్యూ ప్లాంటేషన్‌ను అడి షనల్ డీఆర్డీ పీడీ కృష్ణ, ఎంపీడీవో కారుణశ్రీ పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయనతోపాటు డీపీవో నర్సింగరావు, డీఆర్డీవే పీడీ కృష్ణ, డీఈ హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి రవి, పలువురు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.