మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి..

oppo_2

– డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు
నవతెలంగాణ – కొనరావుపేట 

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలని భాజపా నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు  అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించన భరత మాత ముద్దు బిడ్డ జన సంఘ వస్థాపకులు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ  జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో గోదాం  ఆవరణలో ఆమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటితే వృక్షాలుగా ఏర్పడి పర్యాయవాన్ని కాపాడి వర్షాలు సమృద్ధిగా పండుతాయని దీంతో రైతులు అభివృద్ధి చెందుతారని అన్నారుఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, నాయకులు బాలాజీ, మోహన్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, మాజీ సర్పంచ్లు జవ్వాజి తిరుపతి గౌడ్, జిన్న అనిల్, బాపు రెడ్డి, చింతల పరుశరాములు బైరగోని సురేష్, అంబోజి. లక్మినారాయణ ,ఆకుల నాగరాజు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.