మొక్కలను నాటి సంరక్షించాలి 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అన్నారు బుధవారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం లో మొక్కల పెంపకం చేపట్టిందన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తరాల లత మహేందర్ పంచాయతీ కార్యదర్శి శారద తదితరులు పాల్గొన్నారు.