– పోలీస్ కమిషనర్ శ్వేత
నవతెలంగాణ – సిద్దిపేట
పిల్లలు ఇష్టపడి ఆడి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. సీఎం కప్పు పోటీలలో భాగంగా బుధవారం ఉదయం స్విమ్మింగ్
పోటీలను స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల మల్లికార్జున్, డివై ఎస్ ఓ నాగేందర్ తో కలిసి ఆమె క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ను నిర్మాణం చేసుకున్నట్లు తెలిపారు. క్రీడాకారులు సౌకర్యాలను ఉపయోగించుకొని క్రీడలలో రాణించాలని కోరారు. డి వై ఎస్ ఓ నాగేందర్ మాట్లాడుతూ మూడు రోజుల నుండి జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడలు రసవత్తరంగ జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రీడలలో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, అక్కడ మంచి ప్రైజ్ మనీ ఉందని అన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొన్న వారిలో మంచి నైపుణ్యం, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి పంపించానున్నట్లు తెలిపారు. క్రీడాకారులను
నైపుణ్యాన్ని పి ఈ టి, పిడి, అబ్జర్వర్లు పరిశీలించినట్టు చేసినట్లు తెలిపారు. కబడ్డీ , కోకో, అథ్లెటిక్స్, షటిల్, వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లను ఆడించారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు, సభ్యులు రాజయ్య, అక్బర్, కనకా రెడ్డి, రవీందర్ రెడ్డి, శివకుమార్, సంజీవ్ , క్రీడాకారుల తదితరులు పాల్గొన్నారు.