హీరో అల్లరి నరేష్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకుడు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమత అయ్యర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘హనుమాన్’ చిత్రీకరణ సమయంలో ఈ కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఈ కథలో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మొదటి నుంచి మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. ఇందులో కూడా అలాంటి పాత్ర చేయటం హ్యాపీగా అనిపించింది. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ ఉన్న సినిమా ఇది. 80ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. టౌన్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ ఉన్న లుక్‌లో కనిపిస్తాను. తను చాలా సెన్సిటీవ్, వెరీ ఎమోషనల్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, హీరో నరేష్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గా ఉండే పాత్ర చేశా. నరేష్ అద్భుతమైన యాక్టర్. ఎలాంటి భావోద్వేగాన్ని అయినా సరే పండించగలరు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. దర్శకుడు సుబ్బు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. ఎమోషన్స్‌ని చాలా అద్భుతంగా తీశారు. ‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటలు మరింతగా కనెక్ట్ అవుతాయి. నిర్మాత రాజేష్ దండా ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.