– నేను నిరుపేదను ఆదుకోండి..
– ఒక నిండు జీవితాన్ని ప్రసాదించండి..
– దాతల సహాయం కోసం ఎదురుచూపులు.
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్లీజ్ హెల్ప్ మీ… ఒక నిండు జీవితాన్ని ప్రసాదించండి.. ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రులకు వెళ్తే ఆరు లక్షల పైనే వెచ్చించుకోవలని, ప్రస్తుతం మా కుటుంబ పరిస్థితి బాగోలేదని, నేను నిరుపేదను నన్ను అందుకోని, ఒక నిండు జీవితాన్ని ప్రసాదించాలని దాతలు చేసే సహాయం పైనే ఆధారపడి వారు చేసే ఆర్థిక సహాయం కోసమే ఎదురుచూపులు చూస్తున్నానని ఒక అబాగ్యుడు తన ఆవేదనను వ్యక్తపరిచారు. డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి గ్రామానికి చెందిన చింతం జ్ఞానేశ్వర్2014లో అనుకోని విధంగా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో వెన్నుపూస విరిగింది.Spinal ,Cord injury ఆ సమయంలో అత్యవసరంగా భావించి డాక్టర్లు రెండు రాడ్లు వేశారు. అందులో ఒకటి ఇప్పుడు విరిగిపోయింది. వాటిని తీసి మళ్ళీ వేరే రెండు రాడ్స్ 2 కేజ్ లు వెసి 2 ఆపరేషన్లు చెయ్యాలని డాక్టర్లు సూచించినట్లు జ్ఞానేశ్వర్ వివరించారు.2 Spines Surgeries చెయ్యాలి. Spine Disc లు కూడా పాడయ్యాయని వాటికి ఖర్చు 6 లక్షల పై వరకు అవుతుందని డాక్టర్ చెప్పినట్లు వివరించారు.ఎవరైనా సహాయం చేసి తన జీవితాన్ని ప్రసాదించే విధంగా చూడాలని విన్నవించుకున్నట్లు రోదిస్తూ తెలిపారు. సహాయం చేసేవారు ఒక్క రూపాయి నా చేతికి ఇవ్వకండని, చికిత్స చేసే ఆస్పత్రిలోనే అందజేసి సహకరించాలన్నారు.నా కుటుంబంలో మొత్తం నలుగురం ఉంటామని, మా అమ్మ, నాన్న, చెల్లెలు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారని, ప్రస్తుతం నా నాన్న పెరాలిసిస్ పేషెంట్ తను ఏ పని చేయలేడని, నన్ను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాడని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మ మాత్రమే మా ఇంటి కోసం ఆనాటి నుండి నేటి వరకు రాత్రి పగలు అనకుండా ఎంతో కష్టపడుతున్నారు. అమ్మ వ్యవసాయ కూలీ, ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం, ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి నా ఆపరేషన్ చేయించుకునే స్థితిలో కుటుంబం లేదని వాపోయారు. మొదటగా హైదరాబాదులోని నీమ్స్, ఎయీమ్స్ ఆసుపత్రులకు వెళ్లానని, ఆసుపత్రులలో డాక్టర్లు నన్ను చూసి ఈ కేసుని మేము తీసుకోలేమని, ఇక్కడ మేము ఏలాంటి చికిత్స చేయలేమని, ముందు ఆపరేషన్ ఎక్కడ చేశారో అక్కడే చేయించుకోవాలని సలహా ఇచ్చినట్లు జ్ఞానేశ్వర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని ప్లీజ్ దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి ఆగు జీవితం ప్రసాదించి నా కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నట్లు వేడుకున్నాడు.