బాలోత్సవ పిల్లలం
భావి భారత పౌరులం
కులం వద్దు మతం వద్దు
సమతే మా సరిహద్దు
జాతి నీతి గౌరవం
జగాన నిలిపే బాలలం
చాచా నెహ్రూ కలల పంటలను
చక్కగ మేము పండిస్తాం
ఆత్మ గౌరవ దారుల్లో..
వడిగా అడుగులు వేసేస్తాం
మహనీయుల త్యాగాలను
మరవని బాల వీరులం
ఆకాశమే హద్దుగా..
అవనిని మేము గెలుస్తాం
విజయం కోసమే కాదు
విలువల కోసం జీవిస్తాం
ఎదురొచ్చే గాలులెన్నైనా..
ఆశను మేము కోల్పోము
చదువులంటే చాందసం కాదు
సైన్స్ కే ఎప్పుడూ స్వాగతం
బేధం లేని పంచభూతాల్లా..
స్వార్థం లేని సూర్యచంద్రుల్లా..
వివక్షలేని ప్రకృతి లాగా …
విలువైన ఆశయాలతో…
నిత్య నూతనమవుతాం
సోదరత్వం మానవత్వపు
పరిమళాలతో వికసిస్తాం
మూఢనమ్మకాలు నిర్మూలిస్తాం
ప్రకృతిని మేము పరిరక్షిస్తాం
దేశం గర్వించే బావి పౌరులుగా సంసిద్ధులమౌతామని….
ప్రకృతి సాక్షిగా….
ఇదే మా ప్రమాణం !
ఇదే మా ప్రయాణం!!
– భూపతి వెంకటేశ్వర్లు
అద్యక్షులు, తెలంగాణ బాలోత్సవం
9490098343