బషీరాబాద్ లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ 

Pledge on cleanliness in Bashirabadనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో బుధవారం సచ్ఛత హి సేవలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛత పై ప్రతిజ్ఞ చేశారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి. చంద్రశేఖర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.  గ్రామ పంచాయతీ సమీపంలోని గాంధీ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్వచ్ఛత పై ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి.చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.పంచాయతీ కార్యదర్శి బి. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డి. ఆనంద్, ఉపాధ్యక్షులు పి. రాములు, ఏఎన్ఎమ్ మమత, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విఓఎలు, మహిళా సంఘాల సభ్యులు, రేషన్ డీలర్లు, బీపీఎం ప్రకాష్ , గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.