రైతుబంధు పై సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ – శంకరపట్నం
రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు బుధవారం శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేతిరి మధుకర్ రెడ్డి,ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డీసీఓ మనోజ్ కుమార్, హాజరై మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా( రైతుబంధు) లో ప్రతి సహకార సంఘంలోని సభ్యులు,రైతులు,ఆదర్శ రైతుల, అభిప్రాయం మేరకే ఎన్ని ఎకరాల వాళ్లకు,భరోసా ఇవ్వాలనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఆర్ శ్రీనివాస్,సీనియర్ ఆడిటర్ శ్రీనివాస్, సి ఈ ఓ పోలు వీరస్వామి,కొరిమి వేణు,ఏఈఓ లక్ష్మీ ప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి,డైరెక్టర్లు కల్వకుంట్ల సత్యనారాయణ,రావు,శేషాచార్యులు, జూల శ్రీనివాస్,తాండ్ర స్వరూప,బాకారపు రవి,తిరుపతి సమ్మయ్య,ప్రవీణు,తదితరులు పాల్గొన్నారు.