– ప్రతిరోజూ ప్రత్యేకతే
– నెలరోజులూ పూజలు, వ్రతాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రావణం.. శుభప్ర దం.. ఈ మాసం ఎంతో ప్రాముఖ్యత ఉంది. పౌర్ణ మినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి సంచరించటం వల్ల శ్రావణమాసం పేరు వచ్చిందని వేదపండితులు చెబుతున్నారు. ఈ మాసం వస్తూనే పండుగ లను తీసుకువస్తుంది. ఇక నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య తదితర పండుగలు ఈ మాసంలో రావడం దీని ప్రత్యేకత. ఈనెలలో మహిళలు పూజలతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.
శ్రావణం.. శుభప్ర దం.. ఈ మాసం ఎంతో ప్రాముఖ్యత ఉంది. పౌర్ణ మినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి సంచరించటం వల్ల శ్రావణమాసం పేరు వచ్చిందని వేదపండితులు చెబుతున్నారు. ఈ మాసం వస్తూనే పండుగ లను తీసుకువస్తుంది. ఇక నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య తదితర పండుగలు ఈ మాసంలో రావడం దీని ప్రత్యేకత. ఈనెలలో మహిళలు పూజలతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.
మార్కెట్లో సందడి..
ఈ మాసంలో మార్కెట్లో సందడి నెలకొంటుంది. నూతనవస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు కొను గోలు చేస్తుంటారు.పల్లెల్లో, పట్టణంలోని పలు వస్త దుకాణాల్లో ప్రత్యేక ఆపర్లు ప్రకటించి వినియోగ దారులను ఆకట్టుకుంటున్నాయి. పూలు, పండ్ల వ్యాపారులకు డిమాండ్ పెరగనుంది.
సోమవారం: ముక్కంటి ఈశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు, శివుడికి అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తే స్వామి కటాక్షాన్ని పొందవచ్చు. అర్చనలు చేసి నమస్కరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని సందర్శకుల విశ్వాసం.
మంగళవారం: అభయమిచ్చే ఆంజనేయుడు.. సకల విఘ్నాలు తొలగించి ముందుగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు. సంతాన భాగ్యాన్ని కలిగించే శుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళవారం జన్మిoచారని పురాణాలు చెబుతున్నాయి.మంగళగౌరికి ప్రీతికరమైన రోజు ఆయా దేవతలందరిని భక్తిబీశ్రద్దలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం.
బుధ,గురువారాలు:
శ్రావణమాసంలో బుధవారం అయ్యప్ప స్వామికి, గురువారం రాఘవేంద్ర పూజలతోపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. రెండో శుక్రవారం 16న వరలక్ష్మీ వ్రతం చేసు కుంటారు. అలా కుదరని వారు నాలుగవ శుక్రవారం 30న ఆచరిస్తారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో శ్రీలక్ష్మీదేవికి, ఆలయాల్లో పూజలు, వ్రతాలు, సామూహిక కుంకుమ పూజలుంటాయి.స్వామి, దక్షిణమూర్తి, సాయిబాబాలకు ప్రీతికర మైన రోజులు. ఆయా దేవతలను, గురువులను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం,
శుక్రవారం: శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్ర వారం ఎంతో ప్రాధాన్యం. వరలక్ష్మి వ్రతంచే వారికి శుభప్రదమైన వారం. అమ్మవారికి కుంకు మార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లెల మాలను సమర్పిస్తే పాపాలు తొలగి రుణవిముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
శనివారం: కలియుగదైవం శ్రీనివాసుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం. ఉపవాస దీక్షలు చేప డతారు. స్వామివారికి పుష్పార్చనలు, తులసీదళల మాలలు సమర్పిస్తారు. ప్రతి శనివారం ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.