కరెంటు ఉద్యోగుల కష్టాలు

నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని తానాకుర్ధి గ్రామం, మోపాల్ మండల కేంద్రంలో గల శివారులో ఐదు రోజుల క్రితం పడిన వడగళ్ల వాన వల్ల ఇప్పటికే రైతుల పంట పొలాల్లో కరెంటు కష్టాలు తీరడం లేదు. ఎలక్ట్రిసిటీ సిబ్బంది గత రెండు మూడు రోజుల నుండి 12 గంటల పదమూడు గంటలకు కష్టపడ్డా కూడా ఇంకా ఒక్క కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత వల్ల ఏఈ, ఏడీలకు తలకు మించిన భారం అవుతుంది. కేవలం ఇప్పటికే తనకుర్ధి గ్రామ పరిధిలో 100 కు పైగా కరెంట్ స్తంభాలు విరిగిపోయి దాదాపు ఐదారు ట్రాన్స్ఫార్మర్లకు తీరని నష్టం వాటిల్లింది .ఇప్పటికే చాలామంది రైతులు తమ పంట పొలాల్లో వరి నాడు మల్లు తయారు చేసుకోవడానికి వెనుక పడడంతో మోటార్ ఇంజన్లు పెట్టి పారించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎలక్ట్రిసిటీ ఉన్నతాధికారులు సిబ్బందిని పెంచి ఆ గ్రామంలో గల రైతుల కష్టాలు తీర్చాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏఈ బాబా శ్రీనివాస్ గత మూడు రోజుల నుండి ప్రొద్దున నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ పనులు చక్కబెట్టాలని చూస్తున్నా కూడా సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది. ఒక రెండు మూడు రోజులు నుండి రాత్రి కూడా సబ్ స్టేషన్ లోనే ఉండడం జరిగింది. మొన్నటి వరకు ఎలక్షన్ బిజీలో ఉన్న అధికారులు ఆ వడగళ్ల వాన ఇబ్బంది వల్ల గత నాలుగు రోజుల నుండి నిరంతరం విశ్రాంతి లేకుండా ఎలక్ట్రిసిటీ పనుల పైనే బిజీగా ఉన్నారు.
ఈ మోపాల్ మండల్ సబ్స్టేషన్ పరిధి చాలా పెద్దది కానీ కిందిస్థాయి సిబ్బందులు లేక ప్రతిక్షణం ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతుంది అలాగే ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ పైన అధిక భారం పడుతూ గత మూడు నాలుగు రోజుల నుండి నిద్రలేని రాత్రులు గడుపుతూ రాత్రి సమయంలో కూడా కరెంట్ పోల్ వర్క్ ని చేయించడం జరుగుతుంది. వారి కష్టాలను చూసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ నారుమడి వేసే సమయంలో నీరు లేక వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. జిల్లాలో కేవలం మోపాల్ మండలం , కాకుండా చాలా మండల కేంద్రాల్లో సరైన ఎలక్ట్రికల్ సిబ్బంది కొరత వల్ల ఇదే పరిస్థితి తరచుగా కొనసాగుతుంది. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా దీనికి పరిష్కార మార్గం చూపుతారని రైతులు జి ఆశిస్తున్నారు