– ఇంటికే పరిమితమవుతున్న వైనం
నవతెలంగాణ-నంగునూరు
పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నెల 18 నుంచి నంగునూరు మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో కొందరు విద్యార్థులు నడిచి వెళుతూ అవస్థలు పడుతున్నారు. మరికొంత మంది ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. మేడారం జాతర పేరిట నంగునూరు మండలానికి బస్సు సర్వీసులు రద్దు చేశారు. జాతర పూర్తి అచొపి బస్సుల్ని పునరుద్ధరణ చేయక పోవడంతో వారం రోజుల నుంచి ఇంటికే పరిమితం అవునన్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతు న్నారు. కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు బస్ పాస్‌లు ఉన్నప్పటికీ బస్సు ల్లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్తున్నారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోవట్లేదు. పది, ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిం చాలని ఊదర కొడుతున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం వారం రోజుల నుంచి మండలానికి బస్సు సౌకర్యం లేకపో యినా ఎవరూ మాట్లడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిసు ్తన్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రత్యేక తరగతులకు కూడా హాజరు కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రయాణికులకు, విద్యార్థులకు మెరుగైన సేవలు కల్పి స్తూన్నామనే హామీ కళగానే మిగులుతోంది. ఈ విషయం పై ఆర్టీసీ సీఐ వివరణ కోరగా జాతరకు వెళ్లే బస్సులు పూర్తిగా రాలేవని చెప్పారు. ఒక రోజు రెస్ట్ ఇచ్చామని రాగానే పునరుద్ధరణ చేస్తామని తెలిపారు.