ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన బోదాస్ పాపయ్య మరణించడంతో అతని భార్య బోదాస్ నడిపి రాజు కు ఏర్గట్ల ఎస్భిఐ బ్యాంక్ మేనేజర్ కరీముల్లా రూ.2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎస్భిఐ లో సెవింగ్స్ ఖాతా కలిగి ఉండి,సంవత్సరానికి 436 రూపాయల ప్రీమియం చెల్లిస్తే,ఖాతాదారుడు మరణించినప్పుడు వారి కుటుంబానికి 2 లక్షల భీమా ఉంటుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సర్వీస్ మేనేజర్ ధర్మపురి,ఏరియా బీడీఎం శ్రీధర్,బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.