కేవైసీ చేసుకున్న రైతులకే పీఎం కిసాన్

– మండల వ్యవసాయాధికారి కుమార్ యాదవ్

నవతెలంగాణ – పెద్దవంగర
కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ప్రస్తుతం పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయని మండల వ్యవసాయాధికారి కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 1 ఫిబ్రవరి 2019 సంవత్సరానికి ముందు పట్టాపాస్ పుస్తకం పొందిన రైతులకే డబ్బులు పడుతున్నాయని, ఆ తర్వాత 2020- 21,22,23 సంవత్సరాల్లో పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఇంకా డబ్బులు పడట్లేదని తెలిపారు. రైతులు పీఎం కిసాన్ కోసం కేవైసీ తో పాటుగా, పీఎం కిసాన్ ఆధార్, మొబైల్ లింక్ చేసుకోవాలన్నారు. సందేహాల నివృత్తి కోసం రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.