ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోడీ

నవతెలంగాణ-బేగంపేట్‌
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం ఉదయం మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేష వస్త్రం అందజేశారు. ఆలయ ఈవో మనోహర్‌ రెడ్డి, వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని బహు0కరించారు. అనంతరం మహంకాళి ఆలయం నుంచి ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లారు.