ఈ నెల 10న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళ

నవతెలంగాణ – జన్నారం  
జన్నారం మండల కేంద్రంలో ఉన్న  ప్రభుత్వ ఐటీ కళాశాలలో పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళాను నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 10న తమ కళాశాలలో అప్రెంటిషిప్ మేళ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు బయోడేటా ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ హాజరు కావాలని ఆయన సూచి. పెన్నార్ ఎలక్ట్రికల్స్, రానే ఇంజన్ వాల్స్, తదితర కంపెనీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. అవకాశాన్ని అభ్యర్థులు  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.