కుల వృత్తులను బలోపేతం చేయడానికి పీఎం విశ్వకర్మ పథకం

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకువచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటు ఉపాధి రంగంలో రాణించాలని బీసీ వెల్ఫర్ అధికారి రాజలింగు అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఎడు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న స్వర్ణకారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. రాంనగర్ లో శిక్షణ -ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వర్ణకారులకు పలు సూచనలు చేశారు. కుల వృత్తులను ఆర్థంగా మరింత చేయూత నిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షురిటి లేకుండా వ్యాపారం కోసం రుణాలు ఇస్తుందని అధికారి రాజలింగు అన్నారు. రుణం ఇచ్చిన తరువాత ఏడు రోజులు శిక్షణ అందిస్తు రాణించేల చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి అవకాశాలను కులవృత్తుల వారు సద్వినియోగం చేసుకుంటు ఉన్నతంగా ఎదగాలన్నారు. గతంలో బీసీ కార్పోరేషన్ నుంచి రుణాలు తీసుకున్నారే తప్ప వ్యాపారాలు పెట్టుకోలేదన్నారు. అలా చేయకుండా వ్యాపారంలో స్థిరపడేల కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఇన్ చార్జి శ్రీనివాస్ యాదవ్, స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం, శిక్షకులు ప్రశాంత్, రాజు ఉన్నారు.