జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 8వ ఎడిషన్‌ను లాంఛ్ చేసిన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌

PNB MetLifeన‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
పీఎన్‌బీ మెట్‌లైఫ్, ఇండియాలో ప్రీమియర్ జీవిత బీమా కంపెనీలలో ఒకటి కాగా, 8వ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (జేబీసీ)ని సగర్వంగా ప్రకటించింది, ఇది దేశవ్యాప్తంగా యువ బ్యాడ్మింటన్ ఔత్సాహికులలో అభిరుచిని రగిలించే కార్యక్రమంగా నిలుస్తోంది. గత ఎడిషన్‌లు సాధించిన భారీ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో, ఈ ఛాంపియన్‌షిప్ క్రీడాస్ఫూర్తి, నైపుణ్యాభివృద్ధి, మరియు ఇండియాలోని యువ షట్లర్‌లలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా నిలవనుంది. ఈ ఏడాది ఛాంపియన్‌షిప్ 10 ప్రధాన నగరాలలో జరగనుంది: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గువహటి, కొచ్చి, జలంధర్, అహ్మదాబాద్, హైదరాబాద్, రాంచీ, మరియు లక్నో నగరాలలో యువ క్రీడాకారులకు, తమ నైపుణ్యాలను ప్రదర్శించి, రాష్ట్ర స్థాయిలో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆగస్ట్ 1న న్యూ ఢిల్లీలో ఈ నగరానికి చెందిన మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ దాని స్థాయి అలాగే ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. గత 7 ఎడిషన్‌లలో జరిగిన 38,000 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో 48,000 మంది క్రీడాకారులను ఆకర్షించాయి. 2022 ఇంకా 2023లో వరుసగా రెండు సంవత్సరాలలో ‘బహుళ నగరాల్లో బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక మంది పిల్లలు పాల్గొన్నందుకు’ ప్రపంచ రికార్డ్‌తో వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (డబ్ల్యూఆర్‌సీఏ) ఈ ఛాంపియన్‌షిప్‌ను గుర్తించింది.
7 మరియు 17 సంవత్సరాల మధ్య వయస్సు గల ఔత్సాహిక ఆటగాళ్లకు కీలక వేదికగా సేవలందిస్తున్న పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్, సింగిల్స్ ఫార్మాట్‌లో నిర్వహించే మ్యాచ్‌లతో అండర్ 9 నుండి అండర్ 17 వరకు పలు రకాల విభాగాలలో పోటీలను నిర్వహిస్తుంది. ప్రతి పార్టిసిపెంట్ గరిష్ట వయో పరిమితి ఉన్నంత వరకు గరిష్టంగా రెండు వయస్సు వర్గాలలో ఆడవచ్చు. పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ మరియు సీఈఓ సమీర్ బన్సల్ త్వరలో జరగబోయే గేమ్‌లపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. “PNB మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మన దేశంలోని యువతలో ప్రతిభను పెంపొందించడానికి మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి పర్యాయపదంగా మారింది. కొన్నేళ్లుగా ఈ  ఛాంపియన్‌షిప్ భారీ స్థాయిలో వృద్ధి సాధించింది. మేము 8వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతున్నాము, వర్ధమాన షట్లర్‌లను అందించడంపై మా దృష్టి కేంద్రీకరించాము. వారిలోని ప్రతిభను ప్రదర్శించడానికి అలాగే మెరుగుపరచడానికి ఇది ఒక వేదిక , అలాగే  వాళ్ల సమున్నత స్వప్నాలను సాధించే మార్గంలో మేము ఈ సంవత్సరం మరింత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి మరియు తరువాతి తరం అథ్లెట్లను ప్రోత్సహించే మరియు సాధికారత కలిగించే మా మిషన్‌ను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాం.” ఏషియన్ గేమ్స్ గోల్డ్‌ మెడలిస్ట్ మరియు పీఎన్‌బీ  మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మెంటార్ చిరాగ్ శెట్టి తన ఉత్సాహాన్ని షేర్ చేసుకున్నారు. “పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌తో మెంటార్‌గా నా అనుబంధాన్ని రెండవ ఏడాది కూడా కొనసాగించడం ఒక అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాను. బ్యాడ్మింటన్ పట్ల నాకున్న మక్కువ నా జీవితాన్ని తీర్చిదిద్దిన క్రీడకు తిరిగి అందించాల్సిన సేవలుగా నన్ను ప్రోత్సహిస్తుంది, అలాగే JBC ద్వారా తర్వాతి తరం వారి సామర్థ్యాన్ని మరియు ఆట పట్ల ప్రేమను కనుగొనడంలో సహాయపడటానికి నేను సంతోషిస్తున్నాను. యువ క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి, పట్టుదలతో విలువైన పాఠాలు నేర్చుకోవడానికి ఛాంపియన్‌షిప్ అద్భుతమైన వేదికను అందిస్తుంది. మెంటార్‌లుగా, నేను ఇంకా సాత్విక్ ఇద్దరూ ఈ యువ అథ్లెట్లకు మార్గదర్శకత్వం అందించడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాము, వారి క్రీడా ప్రయాణాలను తెలుసుకుని, అంచనా వేసి వారికి సహాయపడటానికి మా అనుభవాలను పంచుకుంటాము.”
అలాగే అతని డబుల్స్ పార్ట్‌నర్, ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్ట్, సహచర జేబీసీ మెంటార్ అయిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి మాట్లాడుతూ, “పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు మెంటార్‌గా నా పాత్రను కొనసాగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, వారి కలలను సాధించడానికి ఇది ఒక మెట్టుగా నిలుస్తోంది. ఈ యువ ఛాంపియన్‌లకు మార్గదర్శకత్వం వహించడం, క్రీడ పట్ల వారి ఎదుగుదల, అభిరుచికి సాక్ష్యంగా నిలవడం చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ కార్యక్రమం నిజంగానే భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తును నిర్మిస్తోంది,” అని అన్నారు. ఈ క్రీడలో నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి అలాగే ఇండియాలో బలమైన బ్యాడ్మింటన్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి జేబీసీ కట్టుబడి ఉంది. ప్రకాష్ పదుకొణె మరియు అశ్విని పొన్నప్పతో సహా అగ్రశ్రేణి భారతీయ ఆటగాళ్లు,  కోచ్‌లు ఆమోదించిన బూట్ క్యాంప్ వంటి కార్యక్రమాల ద్వారా, ఈ క్రీడా పోటీలలో పాల్గొనేవారు తమ ఆటను మెరుగుపరచుకోవడానికి నిపుణుల మార్గదర్శకత్వం అలాగే శిక్షణను పొందుతారు.