నవతెలంగాణ ఢిల్లీ: పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కొత్తగా స్మార్ట్ కమ్యూనికేషన్స్ యాప్‌ను లాంఛ్ చేస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపింది, ఇది కస్టమర్లు తమ ఏజెంట్లు, విలువైన పార్ట్‌నర్‌లు, మరియు ప్రొప్రైటరీ సేల్స్ ఫోర్స్ (PSF)తో మెరుగ్గా సంప్రదింపులు జరిపేందుకు వీలు కల్పించే ఒక కొత్త డిజిటల్ సాధనం. దీనికి గల ప్రత్యేకమైన ఫీచర్‌లతో, స్మార్ట్ కమ్యూనికేషన్స్ యాప్ అనేది విక్రయ ప్రక్రియలను సరళీకృతం చేస్తుంది, అలాగే కస్టమర్లు, ఏజెంట్ల మధ్య సుదీర్ఘ కాలం బంధం నిలిచే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఏడాదికి లక్ష్యాలను నిర్దేశించుకున్న పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఏజెంట్స్, విలువైన పార్ట్‌నర్‌లు, మరియు పీఎస్ఎఫ్ మెంబర్‌లలలో మూడవ వంతు మంది, ఈ యాప్‌ను లాంఛ్ చేసిన మొదటి 48 గంటలలోపే దీనికి సైనప్ చేసుకుని, ఈ శక్తివంతమైన సాధనాన్ని వీలైనంతగా ఉపయోగించుకోవడానికి తమ ఉత్సాహాన్ని చాటారు.
స్మార్ట్ కమ్యూనికేషన్స్ యాప్‌లో ఈ కింది వాటితో సహా పలు కీలక ఫీచర్‌లు ఉన్నాయి:
- అంతరాయం లేని కమ్యూనికేషన్: కస్టమర్‌లు తమ పాలసీ ప్రయాణంలోని ప్రతి దశలోను అప్‌డేట్‌గా ఉండేందుకు ఈ యాప్ సహకరిస్తుంది.
- వ్యక్తిగతం చేయబడిన ఎంగేజ్‌మెంట్: 11 ప్రాంతీయ భాషల్లో అనుకూలం చేయబడిన మార్కెటింగ్ కొలేటరల్‌లు, డిజిటల్ విజిటింగ్ కార్డ్‌లు మరియు పండుగ శుభాకాంక్షలు వంటి ఫీచర్‌లతో, కస్టమర్‌లు తమ ఏజెంట్‌లతో మరింత వ్యక్తిగతంగాను, సాంస్కృతికంగాను సంప్రదింపులను ఆస్వాదించవచ్చు.
- పేపర్‌లెస్ సొల్యూషన్స్: పీఎన్‌బీ మెట్‌లైఫ్ యొక్క గ్రీన్ చొరవలకు నిజంగా కట్టుబడుతూ, ఈ యాప్ కాగితం రహిత వర్క్‌ఫ్లోకు మద్దతు ఇస్తూ, ఆయా అంశాలను సులభతరం చేయడం మాత్రమే కాకుండా, మన గ్రహాన్ని రక్షించడంలో కూడా సహాయపడే విధంగా డిజిటల్ బ్రోచర్‌లు, మరియు వనరులను అందిస్తుంది.
- ఏజెంట్ డాష్‌బోర్డ్: ఏజెంట్‌లకు కస్టమర్ కనెక్షన్‌లు మరియు పురోగతి యొక్క ఏకీకృత వీక్షణను అందస్తుంది.
“స్మార్ట్ కమ్యూనికేషన్స్ యాప్‌ను లాంఛ్ చేయడం డిజిటల్ ఆవిష్కరణపై మా దృష్టిని ప్రతిబింబిస్తుంది, అలాగే మా కస్టమర్‌లతో విశ్వసనీయమైన, పారదర్శకమైన, వ్యక్తిగతం చేయబడిన కమ్యూనికేషన్‌లను అందించడంలో భాగంగా మా మిషన్‌లో, ఇది ఒక పెద్ద అడుగు” అని సుదీప్ పీ బీ, చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్, ప్రొప్రైటరీ మరియు పీఎన్‌బీ, పీఎన్‌బీ మెట్‌లైఫ్, తెలిపారు.
“ఇది కస్టమర్‌తో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి, అలాగే నిజమైన సంరక్షణను అందించడానికి మా ప్రజలకు సాధికాతర ఇస్తుంది. మా కస్టమర్‌ల “జీవిత చక్రం”లో ఆధారపడదగిన భాగస్వామిగా ఉండాలనే మా నిబద్ధతలో ఇవన్నీ భాగం.”