
పీఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పడమటి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను వలిగొండ మండల పరిధిలోని టేకులసోమవారం గ్రామంలో బుధవారం పీఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో సాధన మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాధన మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో పండ్లను పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అద్యక్షులు చేగూరి జంగయ్య, చేగూరి గోపాల్, రాజమల్లు, విజయభాస్కర్ రెడ్డి, కొండల్ రెడ్డి, నర్సిరెడ్డి, సతీష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాలనర్సింహ, లక్ష్మయ్య, మహేందర్ రెడ్డి , శ్రీశైలం, జహంగీర్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.