
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలు ఒక్క పొద్దులుండి భక్తిశ్రద్ధలతో బోనం తయారుచేసి బోనాలతో గ్రామంలోని పోచమ్మ గుడికి ఊరేగింపుగా వెళ్లి తల్లికి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ వేడుకలలో మహిళలు పిల్లలు పెద్దలు గౌడ సంఘం నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.