నవతెలంగాణ నసురుల్లాబాద్
ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ నస్రుల్లాబాద్ మండలాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా రోడ్లపై భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంగళవారం నసూరుల్లాబాద్ మండలం
నెమ్లి గ్రామంలో సాయిబాబా మందిరంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్ ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిరం ఎదుట పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ నేత పోచారం భాస్కర్ రెడ్డికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంగన్ వాడి కేంద్రంలో, ఆసుపత్రిలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పురం వెంకటరమణ, ఇక్బాల్, మాజీ సొసైటీ చైర్మన్ మారుతి పటేల్, ప్రతాప్ సింగ్, మోహన్ పటేల్, ఏడే మోహన్ దుర్కి, మాజీ ఎంపిపి దుర్గం శ్యామల, మైసగౌడ్, భూమయ్య, మంగలి సాయిలు, గిర్మయ్య, బానుగౌడ్, జంగిలి శ్రీనివాస్, మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.