న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో కొత్తగా బడ్జెట్ ధరలో కొత్త పోకో ఎం6 5జిని విడుదల చేసింది. దీన్ని ప్రత్యేకంగా భారతీ ఎయిర్‌టెల్ ఆఫర్లతో అందిస్తున్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 10 నుంచి రూ.8,799కి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 4జిబి-128జిబి, 6జిబి-128 జిబి, 8జిబి-256 జిబి వేరియంట్లలో దీన్ని ఆవిష్కరించింది. 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, వెనుక వైపు 50 ఎంపి కెమెరా, సెల్ఫీ కోసం 5 ఎంపి కెమెరాను అమర్చింది.