న్యూఢిల్లీ : ప్రముఖ ఫోన్ల ఉత్పత్తుల కంపెనీ పోకో కొత్తగా ఆవిష్కరించిన పోకో ప్యాడ్ 5జి అమ్మకాలను బుధవారం మధ్యాహ్నాం 12 గంటల నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో పోకో ఇండియా టాబ్లెట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్లయ్యిందని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికత, సాటిలేని విలువతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,999గా, 8జిబి, 256జిబి ధరను రూ.21,999గా నిర్ణయించింది.