రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పొద్దుటూరి వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్:  బిజెపి రాష్ట్ర పార్టీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పట్టణానికి చెందిన నియోజకవర్గ నాయకులు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ను మంగళవారం నియమించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నన్ను నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఎల్లవేళలా పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తాను.దీనికి సహకరించిన రాష్ట్ర, నియోజకవర్గ మరియు మండల నాయకులకు మరీయ్ ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.