
నవతెలంగాణ-గోవిందరావుపేట : పొదిల్లా నాగమణి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలం పసరలో పొదిల్ల నాగమణి సంతాప సభ తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూడి కృష్ణారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడు తు పొదిల నాగమణి కుటుంబం స్వార్థం లేకుండా ఈ సమాజానికి దోపిడి వ్యవస్థ నశించాలని సమ సమాజం రావాలని కోరికతో తన భర్తను తన కొడుకు ను కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేసింద ని పేర్కొన్నారు. ఈ రోజున స్వార్థ రాజకీయాలు మత రాజకీయాలు కుల రాజకీయాలు నడుస్తున్న ఈరోజుల్లో దేనికి లోను కాకుండా ఈ సమాజం మారాలని తపన పడి నాగమణి కూడా ఈ మండలంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించింద ని పేర్కొన్నారు. తునికాకు పోరాటాలలో కూలి పోరాటంలో పాల్గొంటూ పార్టీలో చురుకుగా పని చేసిందని పేర్కొన్నారు పార్టీకొచ్చిన అనేక ఆటుపోట్లను మేల్కొని నికరంగా నిలబడిందని పేర్కొంటూ అలాంటి కార్యకర్త లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ వారి కుటుంబానికి సిపిఎం పార్టీ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఎల్లవేళలా పార్టీ ఆదుకుంటుందని పేర్కొన్నారు*. ఈ సమాజ మార్పు కొరకు పనిచేయడమే నాగమణికి నిజమైన నివ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం స్వామి పొదిళ్ల చిట్టిబాబు ములుగు జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ కొప్పుల రఘుపతి ఎండి దావూద్ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు మండల నాయకులు సోమ మల్లారెడ్డి ఉపేంద్ర చారి సప్పిడి ఆదిరెడ్డి గుండు రామస్వామి సదానందం ఐలయ్య మహిళా సంఘం కార్యదర్శి కారం రజిత మంచాల కవిత రాజేశ్వరి స్వరూప తదితరులు పాల్గొన్నారు.