కవి జయరాజ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్‌

– నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ పంజాగుట్టలో నిమ్స్‌ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణరావు అవార్డును అందించిన విషయం తెలిసిందే.