కావ్య ప్రబంధాలు

పురాణాల్లో ప్రసిద్ధ కథను గ్రహించి వివిధ వర్ణన, అలంకారాలతో, పాత్ర చిత్రణతో, రస, భావ ప్రధానంగా రచించడం కావ్య పద్ధతి. ప్రకృష్టమైన బంధం(కూర్పు) కలది ప్రబంధం. తెలుగు సాహిత్య చరిత్ర శ్రీకృష్ణదేవరాయల (16వ శతాబ్దం) కాలానికి ప్రబంధయుగం అని పేరు. ఆకాలంలో వెలువడ్డ కావ్యాలకు ‘ప్రబంధాల’ని పేరు. ప్రబంధం కూడా కావ్యమే ఐనా వస్త్వైక్యం, ఏకనాయకాశ్రయం, రసాధిక్యత, నాటకీయత, అలంకారిక రచన, అష్టాదశ వర్ణనలు, స్వతంత్ర రచన అనేకావ్య కళాధర్మాలకు ప్రాధాన్యం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయాల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు రాసిన గ్రంథాలకు ప్రబంధాలని వ్యవహారం గలదు.
సాధన ప్రశ్నలు
1. 1910-11లో నన్నెచోడుడి ‘కుమార సంభవాన్ని’ ప్రకటించి, నన్నెచోడుని కాలాన్ని క్రీ.శ.940గా ప్రకటించినవారు?
ఎ. వేటూరి ప్రభాకర శాస్త్రి బి. శ్రీ మానవల్లి రామకృష్ణ
సి. జయంతి రామయ్య
డి. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
2. తిక్కన తాను రాసిన 15 పర్వాల భారతాన్ని ఇలా పేర్కొన్నాడు
ఎ. శాస్త్రీయ ఇతిహాసం బి. కావ్యేతిహాసం
సి. పంచమవేదం డి. ప్రబంధ మండలి
3. కావ్యయుగమని ఏకాలానికి పేరు?
ఎ. తిక్కనయుగం బి. శ్రీనాధయుగం
సి. రాయలయుగం డి. దక్షిణాంధ్రయుగం
4. ప్రబంధ శబ్దాన్ని తొట్ట తొలుత ప్రయోగించిన కవి
ఎ. నన్నెచోడుడు బి. తిక్కన
సి. ఎర్రన డి. పెద్దన
5. ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అనే బిరుదు ఎర్రనకు ఏ రచనల వల్ల వచ్చింది?
ఎ. నృసింహపురాణం బి. రామాయణం సి. అరణ్యపర్వశేషం డి. హరివంశం
6. జతపర్చుము
1. శ్రీనాధుడు అ. నవనాథచరిత్ర
2. నాచనసోమన ఆ. ఉత్తరహరివంశం
3. పిల్లలమర్రి పినవీరన ఇ. హరవిలాసం
4. గౌరన ఈ. శృంగార శాకుంతలం
1 2 3 4
ఎ. ఇ ఆ ఈ అ
బి. ఇ అ ఈ ఆ
సి. ఈ ఇ అ ఆ
డి. ఇ ఆ ఈ అ
7. ‘ఆంధ్ర కవితా పితామహుడు’ ఎవరు?
ఎ. నన్నయ బి. శ్రీకృష్ణదేవరాయలు
సి. పెద్దన డి. శ్రీనాథుడు
8. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు?
ఎ. ఇందిరామందిరం బి. విజయ భువనం
సి. సారస్వత మందిరం డి. భువన విజయం
9. అల్లసాని పెద్దన రచించిన ‘స్వరోచిష మనుసంభవము’ అనే నామాంతరం గల ‘మనుచరిత్ర’కు మూలం?
ఎ. నన్నయ భారతం బి. మారన మార్కండేయ పురాణం
సి. స్కంద పురాణం డి. మనువు చరిత్ర
10. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని పొగిడినదెవరు?
ఎ. అల్లసాని పెద్దన బి. నన్నయ
సి. శ్రీకృష్ణదేవరాయలు డి. అన్నమయ్య
11. శ్రీకృష్ణదేవరాయల విషయంలో సరికానిది ఏది?
ఎ. విష్ణుచిత్తీయమనే నామాంతరం గల ‘ఆముక్త
మాల్యద’ను రచించాడు.
బి. తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగం
‘స్వర్ణయుగం’గా ప్రసిద్ధి.
సి. ఆయుక్తమాల్యదను వేంకటేశ్వరస్వామికి
అంకితమిచ్చెను.
డి. శ్రీకృష్ణదేవరాయల సభామందిరం
‘విజయభవనం’.
12. గండపెండేరం తొడిగించుకొన్న ప్రబంధయుగపు కవి?
ఎ. నంది తిమ్మన బి. అల్లసాని పెద్దన
సి. ధూర్జటి డి. తెనాలి రామకృష్ణ
13. ‘మాధురీ మహిమ’ కవితా లక్షణం ఎవరిది?
ఎ. నంది తిమ్మన బి. అల్లసాని పెద్దన
సి. ధూర్జటి డి. తెనాలి రామకృష్ణ
14. ‘వసుచరిత్ర’ రచించిన రామరాజభూషనుడికి మరొక పేరు?
ఎ. భట్టుమూర్తి బి. ముక్కు తిమ్మన
సి. వికటకవి డి. శ్లేషకవి
15. తెనాలి రామకృష్ణ కవి రచించిన శైవ ప్రబంధం?
ఎ. శ్రీకాళహస్తి మహత్యం
బి. ఉద్భటారాధ్య చరిత్ర
సి. పాండురంగ మహత్యం
డి. ఘటికాచల మహత్యం

సమాధానాలు
1. బి 2. డి 3. బి 4. ఏ 5. సి 6. ఏ 7. సి 8. డి 9. బి 10. సి 11. డి 12. బి 13. సి 14. ఏ 15. బి

– నానాపురం నర్సింహులు, 9030057994