
తాడ్వాయి (నర్సింగాపూర్) మండల కేంద్రానికి చెందిన ధార శ్రీకాంత్ చేసిన “గెలుపు” కవితకు జాతీయ స్థాయి పోటీల్లో పురస్కారం లభించింది. రాష్ట్రంలోని సాహితీ సమస్త అక్షరాలతో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో కృషి అనే అంశంపై జాతీయ కవితల పోటీలు నిర్వహించారు. ఇందులో శ్రీకాంత్ రాసిన “కవిత, గెలుపు” అనే కవితా పురస్కారానికి ఎంపికవగా.. ఈ నెల 9న ఖమ్మంలో జరిగే జడ్పీ మీటింగ్ సమావేశాల్లో పురస్కారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తన రచనలు, గుర్తించి పురస్కారం ఇచ్చిన సాహితీ కళా సమితికి యువ కవి ధారా శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.