సమాజాన్ని మార్చే శక్తి కవులు, రచయితలకు ఉంది..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రచనల ద్వారా సమాజాన్ని మార్చే శక్తికవులు, రచయితలకు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. నవ్య సాహితీ సమితి (ఎన్ఎస్ఎస్), నవ్య నాటక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయంలో ‘వసంతోత్సవం’ నిర్వహించారు. వేడుకలకు డాక్టర్.కె.వి. రమణాచారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వసంతంలో కవులకు, రచయితలకు నూతన ఉత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. ఉగాది లాగానే జీవితం కూడా అన్ని రుచుల సమ్మేళనమని, అందరూ అసూయ, ద్వేషాలను దూరం చేసుకుని జీవితాలను ఆనందమయం చేసుకోవాలన్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్. మాదిరాజు బ్రహ్మానందరావు (సాహిత్యం), డాక్టర్.రాధా సారంగపాణి (సంగీతం), డాక్టర్. కళాకృష్ణ (నృత్యం), డాక్టర్.కె. సాగరరావు (విద్య), అచ్చిరాజు జనార్దన్రావు (పత్రిక)లకు నిర్వాహకులతో కలిసి డా డాక్టర్.కె.వి.రమణాచారి ‘నవ్య ఉగాది’ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు పాల్గొన్నారు. ఎన్ఎన్ఎస్ అధ్యక్షుడు వేమరాజు విజయ్కుమార్, కోశాధికారి యూ. హెచ్. హరినాథ్ బాబు, కార్యదర్శి ఆర్.ఎన్.సుధారాణి, లక్ష్మీమానస, సమన్వయకర్త సుధామల నిష్ఠల తదితరులు పాల్గొన్నారు.