
– మనుషులు, మూగజీవాలపై దాడి
– బట్టుగూడెంలో ఆవుదూడపై కుక్కలు దాడి చేసి చంపేసిన వైనం
నవతెలంగాణ – పెద్దవూర
మండలం లో కుక్కలు స్వరవిహారం చేస్తున్నాయి మనుషులు, మూగ జీవాలు అనేది లేకుండా దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లో శునకాలు అంటేనే బేంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తూ దాడులు చేస్తూ గాయపర్చూతున్నాయి. ప్రధాన రహదారుల్లో, చెత్త డంపింగ్ వద్ద కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడితో వాహనదారులు, పాదచారులు బెదిరిపోతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.మండలం లోని బట్టుగూడెం, పెద్దవూర, చింతపల్లి పెద్దగూడెం, కొత్తలూరు,గర్నెకుంట, వెల్మగూడెం ఉట్లపల్లి, చలకుర్తి గ్రామాల్లో కుక్కలు ప్రజలను, చిన్నారులను భయబ్రాంతులకు గురించేస్తున్నాయి.బట్టుగూడెం లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కుక్కలు తిరుగు తున్నాయి. ఏ వీధి చూసిన కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి.
ఆవు దూడను చంపేసిన కుక్కలు: ఉదయం వాకింగ్ పోయేవారు, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి వెంట పడి తరుము తున్నాయి.గత కొద్దీ రోజుల క్రితం బట్టుగూడెం గ్రామానికి చెందిన గుంటుక కోటిరెడ్డి గొర్ల కొట్టం లో కుక్కలు దాడి చేసి 16 మేకల పై దాడి చేసి చేంపేసాయి. ఈ నెల 6 వ తేదీన బట్టుగూడెం కు చెందిన సముద్రాల బాస్కర్ పశువుల కొట్టం లో వారం రోజుల అవు దూడ పై దాడిచేసి చంపి తిన్నాయి. దీంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారులపై, వృద్దులపై కూడా పలుమార్లు దాడి చేసి గాయపరిచి ఆసుపత్రి లో చికిత్స పొందిన ఘటనలు ఉన్నాయని దీంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోందని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో చుక్కలే: ఉదయం వేళల్లో కంటే రాత్రి వేళల్లో కుక్కలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్లు తీసుకొని కొట్టినా వెంటపడి తరుముతున్నాయి. అతి కష్టం మీద వాటి బారి నుంచి తప్పించుకుని ఇళ్లకు చేరుకునే సరికి చుక్కలు కనిపిస్తున్నాయని బట్టుగూడెం వాసులు వాపోతున్నారు. కుక్కల దాడిలో పలువురు,
గాయపడ్డారని చర్యలు తీసుకోవాలని సంభంధిత అధికారులకు ర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను పట్టుకొని తీసుకెళ్లాలని కోరుతున్నారు.
కుక్కల బారి నుంచి రక్షణ కల్పించండి: గుంటుక కోటి రెడ్డి( బట్టుగూడెం ) గ్రామం లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. రాళ్లతో కొట్టిన పారి పోకుండా కొడుతున్న వారిపై దాడికి దిగుతున్నాయి. గత నెల క్రితం మేకల మందపై దాడి చేసి 16 మేకలను చంపేసాయి.కుక్కలను పట్టుకెళ్లి వాటి దాడి నుంచి రక్షణ కల్పించాలని అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలి.
మా ఆవుదూడను కుక్కలు దాడి చేసి చంపాయి: సముద్రాల భాస్కర్ ( బట్టుగూడెం ) మంగళవారం ఈ నెల 6 మాకోట్టంలో వున్న అవు దూడపై కుక్కల గుంపు దాడిచేసి ఈడుచుకొని వెళ్లిచంపి తిన్నాయి. గ్రామస్తులలం వెంటబడితే వారిపై కూడా దాడి చేస్తున్నాయి. బయటికి వెళదాం అంటే వణికి పోతున్నాము. కుక్కల బెడదనుంచి మా గ్రామాన్ని కాపాడాలి.