చిగురిస్తున్న ఉన్మాద కాలమిది
బీభత్సాలకు పురుడు పోస్తున్న బుతువులివి
హింసతప్ప ప్రతిహింస లేని జీవనమిది
గుడ్డి యంత్రమైపోయింది దేహం!
ఓ కన్ను కులం మడుగులో కొట్టుకుంటోంది
మరో కన్ను మతోన్మాదంలో మాయమైపోతోంది
ఉన్న మనోనేత్రం మాయం కాక తప్పదు
సర్వం కోల్పోతున్న సహజత్వాలు రాక్షస రాజకీయ పద్మవ్యూహాల్లోకి
రక్తసిక్త ధనదాహాల్లోకి ఆధిపత్య సర్ప పరిష్వంగాల్లోకి
ఉర్గంధ ఉప్పెనల్లోకి నెట్టేస్తున్నది పాలక బైరూపులోల్లే కదా!
మనకున్న సహజత్వాన్ని వొట్టి తొర్రను చేసి కుల గింజల్నీ మతోన్మాద విత్తనాల్నీ
ఈ సుజల సుఫలాలతో శుద్ధి చేయడమెందుకో!
మానవ వృక్షాలకు మనోపుష్పాలు పూయక పోతే యెలా?
పాలక మందిరాల ముందు ప్రజలు ధ్వజస్థంభాలు కావల్సిందేనా?
ఓటు శిలా ప్రతిమై పోవాల్సిందేనా? రాజకీయ కాలమేఘాల వుత్సులో బతికే బిడ్డలారా?
మనుషులు చేసిన దేవుళ్లారా? దేవుడు చేసిన మనుషుల్లారా?
ఇది రాజకీయ రణకాలం మనోఖడ్గాలకు మరింత పదును పెట్టండి!
– డా||నాళేశ్వరం శంకరం, 9440451960