పేకాట రాయుళ్ళు అరెస్ట్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట
పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేసి పలువురు పేకాట రాయుళ్లు ను అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్.హెచ్.ఒ  ఎస్ఐ శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామన్నగూడెం శివారులో పేకాట ఆడుతుండగా, సమాచారం మేరకు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లు ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.18,400 ల నగదుతో పాటు మూడు సెల్ఫోన్ లను,11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.