నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా మేకల అభినవ్ స్టేడియం లో జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ లో నల్గొండ జిల్లా తడక మల్ల గ్రామానికి చెందిన పోలగాని సందీప్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు.మహబూబ్ నగర్ జిల్లా లో ఈ నెల 31 నుండి 02 వరకు జరుగు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో జిల్లా జట్టు తరుపున పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు నిమ్మల లెనిన్ బాబు తెలిపారు.సందీప్ ఎంపిక పట్ల మండల ప్రజలు, గ్రామస్తులు, తల్లి దండ్రులు, తడకమళ్ల సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎన్. బిక్షం, ఎన్.వెంకన్న,సిహేచ్ వెంకన్న, బీ. రాంబాబు, డీ.ఎల్లయ్య,కే. శివ,చిరంజీవి, అహమ్మద్ అభినందించారు.